![]() |
![]() |

మిస్టర్ అండ్ మిస్సెస్ రియాలిటీ షో ప్రతీ వారం అలరిస్తూ ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. ఇక ఈ ఫినాలేకి డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. దీని ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ప్రోమో స్టార్టింగ్ లో జడ్జెస్ శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ ఒక రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ స్నేహ చేతి మీద ముద్దు పెట్టాడు శివ బాలాజీ దాంతో "బాలాజీ ఆర్ యూ హ్యాపీ.." అని స్నేహ అడగడంతో "చాలా హ్యాపీ.." అంటూ చెప్తూనే తెగ సిగ్గుపడిపోయాడు. వెంటనే శ్రీముఖి "అప్పుడెప్పుడో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చారు ..మళ్లీ ఈ ఫినాలేకి వస్తానని మాటిచ్చారు." అంటూ అనిల్ రావిపూడిని పిలిచింది స్టేజి మీదకు "మన ఎపిసోడ్స్ రెగ్యులర్‌గా ఎప్పుడైనా ఫాలో అయ్యారా?" అని రావిపూడిని శ్రీముఖి అడిగింది. దీనికి "కచ్చితంగా స్నేహ గారి కోసం ఫాలో అవుతాను" అని చెప్పారు. "ఐతే ఎవరి జడ్జిమెంట్ బాగా నచ్చింది.." అనగానే "స్నేహ గారే కరెక్టుగా మాట్లాడతారు." అని అనిల్ చెప్పేసరికి శివబాలాజీకి మండిపోయింది. "మీరు మాత్రం చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు." అంటూ కౌంటర్ వేసాడు.
షోలో ఉన్న జంటలకు కళ్లకు గంతలు కట్టి బాస్కెట్ బాల్ గేమ్ ఆడించారు. ఒకరు కళ్ళకు గంతలు కట్టుకుని బాల్ వేస్తే మరొకరు బాస్కెట్ పట్టుకుని అందులోకి పడేలా చూడాలి. అయితే రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాత ఆడుతున్న టైములో బంతి రెండు స్టెప్స్ పడ్డాక రాకేష్ దాన్ని పట్టుకున్నాడు. అది చూసిన శ్రీముఖి "దొబ్బిందమ్మా.." అంది. దీనికి "అదేంటి టూ స్టెప్స్ లేవా.." అని అడిగేసరికి "లేవని ముందే చెప్పినాను కదరా.." అని గట్టిగా అరిచేసింది. దీంతో రాకేష్ "ఏయ్ లే.." అంటూ శ్రీముఖి చేతిని టచ్ చేశాడు. దీంతో "చెయ్యి లేస్తుందేంట్రా..అని శ్రీముఖి అనేసరికి డ్రెస్ లేచింది అన్నాడు రాకేష్" మళ్లీ కాపురానికి పనికి రాకుండా పోతావ్.. చెప్తున్నాను." అంటూ రాకేష్ కి వేలు చూపిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేసింది. రాకేష్ మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఇక ప్రోమో చివరిలో "విన్నర్ ఎవరూ, టైటిల్ గెలుచుకుంటుంది ఎవరూ..? 3 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకునేదెవరూ?" అంటూ శ్రీముఖి చెప్పింది. తర్వాత "విన్నర్ ఈజ్.."అంటూ అనిల్ రావిపూడి అనౌన్స్ చేస్తుండగా ప్రోమోను ఎండ్ చేశారు.
![]() |
![]() |